Monday, March 30, 2020

బ్రాండ్ - బాజా - బారాత్

మొసలి కన్నీరు
కొంగ జపం
నక్క జిత్తులు
కోడి కునుకు
గ్రద్ద చూపు
కాకి బుద్ధి
ఉడుం పట్టు
ఊసరవెల్లి రంగులు
ఒక్కో ప్రాణీ ఒక్కో విశేషానికి
బ్రాండ్ అంబాసిడర్ .. !
మనిషే మానవత్వానికి
అంబాసిడర్ కాలేక
అన్ని బ్రాండ్ లూ వాడేస్తున్నాడు ...!!!